భారత్‌లోనే 2020 ఫిఫా అండర్‌-17 ఫుట్‌బాల్‌ టోర్నీ

2020 fifa under-17 worldcup
2020 fifa under-17 worldcup


వాషింగ్టన్‌: 2020 అండర్‌-17 ఉమెన్స్‌ వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఫిఫా) అధ్యక్షడుడు గియానీ ఇన్‌ఫాంటినో ప్రకటించారు. ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులను భారత్‌ దక్కించుకున్నది. 2017లో అండర్‌-17 మెన్స్‌ వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ ఆతిథ్యమిస్తున్న రెండో ఫిఫా టోర్నమెంటు ఇదే కావడం విశేషం. ఆల్‌ఇండియా ఫుట్‌ బాల్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ కుశాల్‌ దాస్‌ మాట్లాడుతూ..ఉమెన్స్‌ ప్రపంచకప్‌ ఆతిథ్య హక్కులు తమకు ఇచ్చినందుకు ఫిఫాకు ధన్యవాదాలు. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్‌ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంటు ఎంతగానో ఉపయోగపడుతుందని కుశాల్‌ అభిప్రాయపడ్డారు.

తాజా క్రీడా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/sports/