వీఎల్ ఎస్ఆర్ సామ్ క్షిపణి పరీక్ష విజయం

India successfully tests VL-SRSAM surface-to-air missile

చాందీపూర్ : ఉప‌రిత‌లం నుంచి గ‌గ‌న‌తలానికి ప్ర‌యోగించే స్వ‌ల్ప‌శ్రేణి క్షిప‌ణి వీఎల్-ఎస్ఆర్ సామ్‌ను భార‌త్ ఈరోజు విజ‌యవంతంగా ప‌రీక్షించింది. ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్ తీరంలోగ‌ల ఇండియ‌న్ నావ‌ల్ షిప్ (ఐఎన్ఎస్‌) నుంచి ఈ క్షిప‌ణిని నిట్ట‌నిలువుగా ప‌రీక్షించిన‌ట్లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

వీఎల్-ఎస్ఆర్ అనేది షిప్ బార్న్ వెప‌న్ సిస్టం. ఇది సీ స్కిమ్మింగ్ ల‌క్ష్యాల‌తో స‌హా స‌మీప ప‌రిధిలోని వైమానిక ముప్పుల‌ను న్యూట్ర‌లైజ్ చేస్తుంది. ఈ రోజు హై-స్పీడ్ ఏరియల్ టార్గెట్ అనుకరించే విమానానికి వ్యతిరేకంగా ప‌రీక్ష నిర్వ‌హించామ‌ని, అది విజ‌య‌వంత‌మైంద‌ని డీఆర్డీవో తెలిపింది. ఈ ప‌రీక్ష‌ను డీఆర్డీవో, భార‌త నౌకాద‌ళానికి చెందిన సీనియ‌ర్ అధికారులు ప‌ర్య‌వేక్షించార‌ని పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/