బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత్ అమ్ములపొదలో మరో వజ్రాయుధం

బాలాసోర్‌ : భారత రక్షణ శాఖకు మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వర్షన్‌ను ఒడిశా తీరంలో బాలాసోర్‌లో విజయవంతంగా పరీక్షించింది. కొత్త సాంకేతికతతో అమర్చిన క్షిపణిని భారత్ గురువారం ప్రయోగించింది. ఇది పరీక్ష తర్వాత విజయవంతంగా నిరూపించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి కొత్త వేరియంట్‌లను నిరంతరం పరీక్షిస్తోంది. పాకిస్థాన్ , చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో ఈ పరీక్ష జరుగుతోంది .

అంతకుముందు, జనవరి 11న, ఆధునీకరించిన సూపర్‌సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ‘అధునాతనమైన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అధునాతన వైవిధ్యాన్ని ఈ రోజు INS విశాఖపట్నం నుండి పరీక్షించింది. క్షిపణి లక్ష్యాన్ని కచ్చితంగా చేధించింది. ఈ పరీక్షపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ డీఆర్‌డీవోను అభినందించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/