ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో మళ్లీ కోహ్లీయే టాప్..

virat kohli
virat kohli

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాక్సింగ్స్‌‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 928 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ 864 పాయింట్లతో మూడో స్థానంలో, 791 పాయింట్లతో చతేశ్వర్ పుజారా నాలుగో స్థానంలో ఉన్నాడు. అలాగే లబుషేన్ కొత్తగా 786 పాయింట్లతో టాప్ 5 స్థానంలోకి ప్రవేశించాడు. ఇదిలా ఉంటే పాక్ ఆటగాడు బాబర్ ఆజం నాలుగు స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. ఆజం టెస్టు మ్యాచుల్లో తొలిసారిగా టాప్10లో స్థానంలోకి అడుగు పెట్టాడు. ఇక టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో ఆసీస్ ఆటగాడు పాట్ కమిన్స్ 898 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు, దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబడ 839 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా. కివీస్ బౌలర్ నీల్ వానెర్ (834) మూడో స్థానం, విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ (830) నాలుగో స్థానం, ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (806) ఐదో స్థానంలో నిలిచారు.టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (794) ఆరో స్థానంలో నిలిచాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/