ఫారెక్స్‌ నిల్వల్లో రికార్డును నమోదు చేసిన భారత్‌

Reserve Bank of India
Reserve Bank of India

న్యూఢిల్లీ: ఇండియా ఫారెక్స్ నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ రెండో క్వార్టర్ ముగిసే సమయానికి 5 శాతం విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 2019 మార్చి నాటికి 412.87 బిలియన్ డాలర్లు ఉండగా, సెప్టెంబర్ నాటికి 433.70 బిలియన్ డాలర్లు పెరిగాయి. సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద 618.17 టన్నుల బంగారం ఉంది. ఇందులో 325.87 టన్నులు విదేశాల్లోని బ్యాంకుల్లో సేఫ్ కస్టడీలో ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. మిగతా బంగారం అంత భారత్‌లో ఉంది. డాలర్ల పరంగా చూస్తే మొత్తం విదేశీ మారక నిల్వలో బంగారం వాటా మార్చి 30 నాటికి 5.6 శాతంగా ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి 6.1 శాతానికి పెరిగింది. తాజాగా డిసెంబర్ 13తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇవి 454.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో నిల్వలు 107 కోట్ల డాలర్లు పెరిగాయి. క్రితం వారంలో నిల్వలు 234.2 కోట్ల డాలర్లు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 11 కోట్ల డాలర్లు తగ్గి 2,696.8 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/