స్పెక్ట్రమ్‌ వేలంతో రూ.5.83 లక్షలకోట్లు

telecom
telecom


న్యూఢిల్లీ: టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంద్వారా భారత్‌కు 84 బిలియన్‌ డాలర్లరాబడులు రావచ్చని ఆశాఖ అంచనావేసింది. 2019లో నిర్వహించే వేలంతో గత ఏడాదికంటే రెట్టింపు రాబడులు సాధించాలనే లక్ష్యంతోఉంది. గత ఏడాది టెలికాం నియంత్రణసంస్థ ధరలను కొంతమేర తగ్గించాలని, టెలికాం వాయుతరంగాలు కంపెనీలకు గిట్టుబాటయ్యేవిధంగా ఉండాలనిసూచించింది. టెలికాం శాఖకు ఈ రాబడులే అత్యంత కీలకమైనవని తేలింది. భారత్‌ప్రభుత్వం వాయుతరంగాల వేలంద్వారా సుమారు 5.83 లక్షలకోట్లు రూపాయలు ఆర్జిస్తామని ధీమాతో ఉంది. అదే డాలర్లలోచూస్తే 83.8 బిలియన్‌ డాలర్లనిఅంచనా.

నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం 8600 మెగాహెట్జ్‌ టెలికాం వాయుతరంగాలను ఈ ఏడాది బహుళఫ్రీక్వెన్సీ బాండ్లలో విక్రయానికి తెచ్చింది. స్పెక్ట్రమ్‌వేలంలో అత్యధిక ధరలు ఉండటంవల్ల టెలికాం కంపెనీలకు ఎంతమాత్రం గిట్టుబాటు కావడంలేదు. పైగా భారత్‌ టెలికాం రంగంలో రిలయన్స్‌జియో ఒక్కసారిగా దూసుకుని రావడంతో ఇపుడు ఇతర ఆపరేటర్లు రాబడుల్లో సతమతం అవుతున్నాయి. టెలికాం వాచ్‌డాగ్‌ గత ఏడాది ఆగస్టులో దరలను ప్రతిపాదించింది. వీటిని గణనీయంగా తగ్గించాలని,టెలికాం కంపెనీలకు మరింత పోటీ పెరిగేవిధంగా గిట్టుబాటుధరలు ఉండాల్సిందేనని ట్రా§్‌ు సూచించింది.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/