చైనా యాప్ లపై భారత్ శాశ్వత నిషేధం

టిక్ టాక్, వియ్ చాట్, యూసీ ట్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, ఎంఐ వీడియోకాల్..

Mobile
Mobile

New Delhi: చైనా యాప్ లపై భారత్ శాశ్వత నిషేధం విధించింది. గత ఏడాది జూన్ లో మొత్తం 267 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దేశ సార్వభౌమత్యం, సమగ్రత, రక్షణ, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయంటూ ఐటీ చట్టంలోని 69 ఎ సెక్షన్ ప్రకారం వాటిని నిషేధిస్తూ,  వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

అయితే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వని 59 యాప్ లపై కేంద్రం ఇప్పుడు శాశ్వత నిషేధం వేటు వేసింది. ఆలా శాశ్వత నిషేధం వేటుకు గురైన వాటిలో టిక్ టాక్, వియ్ చాట్, యూసీ ట్రౌజర్, క్లబ్ ఫ్యాక్టరీ, ఎంఐ వీడియోకాల్ వంటి యాప్ లు ఉన్నాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/