ఇండో-పాక్ పోరుకు అంతా రెడీ

ఇండో-పాక్ పోరుకు అంతా రెడీ
India, Pakistan World Cup Match

Monchester: వరల్డ్ కప్‌లో ఇండో-పాక్ పోరుకు అంతా రెడీ అయింది. మాంచెస్టర్స్ వేదికగా హార్స్ రైవల్స్ తలపడనున్నాయి. వరుస విజయాలతో విరాట్ సేన జోరుమీద ఉండగా పాక్ జట్టు పరాజయాలతో విమర్శపాలౌతోంది. మరోవైపు వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ అధికారుల సూచనలతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సజావుగా సాగాలని ప్రార్థనలు చేస్తున్నారు. వరల్డ్ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇండో-పాక్ ఫైట్‌కు అంతా సిద్ధమైంది. వరుణుడు కరుణిస్తే మెగా ఫైట్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు వ్యూహాలు రెడీ చేసుకున్నాయి. సమరానికి సై అంటున్నాయి.వరల్డ్ కప్‌లో రికార్డులు ఇండియాకు అనుకూలం. ఆడే ఆరు మ్యాచ్‌లలో ఇండియానే విజయం సాథించింది. అంతే కాదు మెగా ఈవెంట్‌లో ఇండియా దూకుడుమీద ఉంది. సౌత్ ఆఫ్రికాతోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆసిస్‌ను ఓడించింది. న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు కావడంతో పాక్ పనిపట్టాలనే ఆలోచనలో విరాట్ సేన ఉంది. రోహిత్, కోహ్లీ, పాండ్యా, రాహుల్, ధోనీతో ఇండియా బ్యాటింగ్ బలంగా ఉంది. అంతా ఫామ్‌లో ఉండడం కలిసి రానుంది. దీంతో ప్రతిష్టాత్మక పాక్ పోరులో మరోసారి బ్యాట్‌కు పని చెప్పాలని అంతా పట్టుదలగా ఉన్నారు.