దేశంలో కొత్తగా మరో మూడు ఒమిక్రాన్​ కేసులు..ఏ రాష్ట్రంలో అంటే..

దేశంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం అందర్నీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కేసులు నమోదు అవుతున్న క్రమంలో ఇండియా లోను కొత్తగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో ఇద్దరికి, రాజస్థాన్​లో ఇంకొరికి కొత్త వేరియంట్​ సోకినట్లు తెలుస్తుంది. ఈ మూడు కేసులతో కలిపి ఇప్పటి వరకు ఇండియా లో మొత్తం 24 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దక్షిణాఫ్రికా, అమెరికాల నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్లు మహా సర్కారు తెలిపింది.

దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 10కి చేరింది. జైపుర్​లో మరొకరికి ఒమిక్రాన్​ సోకింది. ఇటీవల జర్మనీ నుంచి జైపుర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. ఆ సంఖ్య సోమవారం నాటికి 10కి పెరిగింది. వీరంతా ఓ వివాహా వేడుకకు హాజరైనట్లు జైపుర్​ చీఫ్​ మెడికల్ హెల్త్ ఆఫీసర్ నరోత్తమ్ శర్మ పేర్కొన్నారు. కొత్త వేరియంట్​ సోకిన కుటుంబానికి కాంటాక్ట్​ అయిన వారందరికీ పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతుండడం తో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ఇప్పటికే మాస్క్ ధరించాలని , సామాజిక దూరం పాటించాలని ప్రకటనలు మొదలుపెట్టాయి.