భారత్‌ తీరుపై ఖురేషి విమర్శలు

Shah Mehmood Qureshi
Shah Mehmood Qureshi

ఇస్లామాబాద్‌: కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై కోపరేషన్‌ ఆర్గనేజషన్‌ సమావేశాలకు ముందు నుంచి భారత్‌ లేఖలు పంపించామని పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషి అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు నెరిపేందుకు చర్చలకు రావాల్సిందిగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌, విదేశాంగ మంత్రి ఖురేషి వేర్వేరుగా లేఖలు రాశారు. ఐతే వీటిపై భారత్‌ స్పందించలేదు. దీంతో ఖురేషి విమర్శలకు దిగారు.
భారత ప్రధాని మోది ఎస్‌సిఓ సదస్సుకు వెళ్లడానికి పాక్‌ ఎయిర్‌స్పేస్‌ను అడిగినప్పుడు తాము అందుకు అంగీకరించామని, కాని మోది పాక్‌ ఎయిర్‌ స్పేస్‌ నుంచి కాకుండా వేరే మార్గంలో వెళ్లారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా భారత్‌ నుంచి సమాధానం లేదు. తాము పొరుగుదేశాలతో పారదర్శకంగా మెలగాలనే ఉద్దేశ్యంతోనే చర్చలకు ఆహ్వానించామని, కాని భారత్‌ ఇలా చేస్తే, వారితో మైత్రి కోసం వెంపర్లాడేది లేదని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం బిష్కెక్‌లో జరుగుతున్న ఎస్‌సిఓ సదస్సులో పాక్‌ తీరును మోది ఎండగడుతూ, పాక్‌ ఇకనైనా ఉగ్రవాద రహిత దేశంగా మెలిగితే కనీసం కొందరైనా మైత్రి కొనసాగిస్తారని లేకపోతే దాయాది దేశం ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని హితవు పలికారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/