ఆర్ధికవృద్ధిలో భారత్‌ మరిన్ని సంస్కరణలు కీలకం!

వాషింగ్టన్‌: శరవేగంగా అభివృద్ధిచెందుతున్న దేశాల్లో భారత్‌మరింత ముందుకు నడవాలంటే మరిన్ని సంస్కరణలు అవసరం అవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇప్పటికే గడచిన ఐదేళ్లలో కీలక సంస్కరణలు తెచ్చిన భారత్‌మరిన్ని సంస్కరణలు భవిష్యత్తులోచేపట్టాల్సి ఉందని వెల్లడించింది. భారత్‌ ఆర్ధిక వృద్ధిపై వస్తున్న ప్రశ్నలపై స్పందించిన ఐఎఎంఫ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ జెర్రీరైస్‌ మాట్లాడుతూ భారత్‌ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధిచెందుతున్న దేశమని, అగ్రరాజ్యాల సరసన చేరుతున్నదని గడచిన ఐదేళ్లుగా సగటున ఏడుశాతం వ1ద్ధి నమోదయిందని అన్నారు. అత్యంత ముఖ్యమైన సంస్కరణలు అమలయ్యాయని మరిన్ని సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. మరింత వృద్ధిజరగాలంటే బౌగోళిక డివిడెండ్‌లు మరిన్ని పెరగాల్సి ఉందన్నారు.భారత్‌ ఆర్ధికవృద్ధి ముఖచిత్రాన్ని ప్రంచ ఆర్ధిక ముఖచిత్రనివేదికలో వెల్లడించనున్నట్లు వెల్లడించారు. ఐఎంఎప్‌ వార్షిక సమావేశాలు ప్రపంచ బ్యాంకు సమావేశాలతోపాటే వచ్చేనెలలోజరగనున్నాయి. అదేసమయంలోప్రపంచ దేశాల ఆర్ధికవృద్ధిపై దేశాలవారీగా సమగ్రనివేదికలుసైతం వెల్లడించే అవకాశం ఉంది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: