సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి

ప్రో క్రోనీ క్యాపిటలిజం ద్వారా వ్యాపార వర్గాల వారికే లబ్ధి

krishnamurthy subramanian
krishnamurthy subramanian

ముంబయి: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేవలం ప్రస్తుత ఆర్థిక నిపుణులపైనే ఆధారపడకుండా, బహుళ ప్రాచుర్యం పొందిన ప్రాచీన అర్థశాస్త్రం లాంటి గ్రంథాలను అధ్యయనం చేయాలని భారత దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈవో) కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్‌ పేర్కొన్నారు. శనివారం ఐఐటీ కాన్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..దేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార విధానాలను మరింత సులభతరం చేయాలని అన్నారు. భారత్‌ ఆశిస్తున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమవ్వాలంటే సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రో క్రోనీ క్యాపిటలిజం ద్వారా కేవలం వ్యాపార వర్గాల వారికి, అధికారంలో ఉన్నవారికే లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రో బిజినెస్‌ పాలసీలు తోడ్పడుతాయని, అంతేకాకుండా వ్యాపార వర్గాల్లో పోటీ తత్వాన్ని పెంచుతామని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/