భారత్‌ ఎప్పటికీ కమలంలా వికసించాలి

Nirmala sitaraman in parliament
Nirmala sitaraman in parliament

New Delhi: భారత్‌ ఎప్పటికీ కమలంలా వికసించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. లోక్‌సభలో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1. న్యూ ఇండియా, 2. సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌, 3. ప్రజా సంక్షేమం అనే మూడు లక్ష్యాలతో వెళ్తున్నామన్నారు. డిజిటల్‌ ఇండియాకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఈ బడ్జెట్‌లో అంత్యోదయ స్కీమ్‌కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

జీఎస్టీ రూపశిల్పి అరుణ్ .జైట్లీ

మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని జీఎస్టీ రూపశిల్పిగా అభివర్ణించిన నిర్మలా సీతారామన్, జీఎస్పీ కారణంగానే 16లక్షల మంది కొత్తగా ఆదాయపన్ను పరిధిలోనికి వచ్చారన్నారు. గత ఏడాది మార్జి నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలు 48.7శాతానికి తగ్గాయన్నారు. జీఎస్టీని విప్లవాత్మక ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు. మోడీ 1.0 హయాంలో దేశంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు.

వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం

వ్యవసాయాభివృద్ధికి 16 సూత్రాల కార్యక్రమం చేపడుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ విధానాన్ని సరళతరం చేస్తున్నామన్నారు.

కౌలు భూములకు కొత్త చట్టం

కౌలు భూములకు కొత్తచట్టం తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్  సభలో 2020-2021 బడ్జెట్ ను కేంద్ర మంత్రి ప్రవేశపెడుతున్నారు. రైతులు సంప్రదాయ ఎరువులకు పెద్దపీట వేయాలన్నారు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామన్నా
రు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/