3,700 మంది విదేశియులను తరలించిన భారత్
లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న పర్యాటకుల కోసం ప్రత్యేక విమానాలు

దిల్లీ: దేశంలో లాక్డౌన్ విధించిన కారణంగా ముంబయిలో చిక్కుకుపోయిన పర్యాటకులను వారివారి దేశాలకు పంపడానికి భారత్ ముందుకు వచ్చింది. ఇందుకోసం గత నెల 25 నుండి ఈ నెల 14 వరకు సుమారు 20 ప్రత్యేక విమానాల ద్వారా వారిని వారి దేశాలకు తరలించింది. కట్టుదిట్టమైన చర్యల మధ్య 3,700 మందిని ముంబయి విమానాశ్రయం నుంచి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో లండన్, పారిస్, టోక్యో, సింగపూర్, అట్లాంటా, ఫ్రాంక్ఫర్ట్ నగరాలకు చెందిన వారు ఉన్నట్లు పేర్కోన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/