భారత్, జపాన్ కీల‌క‌‌ ఒప్పందం

ఇండో పసిఫిక్‌ ఓషియన్‌ ఇనిషియేటివ్ కు ఇక జపాన్ నాయకత్వం

India, Japan Sign Key Pact For Cooperation in 5G Tech, AI and Critical Information Infrastructure

న్యూఢిల్లీ: చైనాకు చెక్ పెట్టేందుకు భార‌త్జ‌పాన్ కీల‌క ఒప్పందం కుదు‌ర్చుకున్నాయి. ఇండో పసిఫిక్‌ ఓషియన్‌ ఇనిషియేటివ్ కు నాయకత్వం వహించేందుకు జపాన్ ఒప్పుకుంది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జపాన్‌ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మొటెగిల జ‌రిపిన చ‌ర్చ‌ల్లో ఈ మేర‌కు నిర్ణ‌యాలు తీసుకున్నారు. సురక్షిత, స్వేచ్ఛాయుత ఇండో, పసిఫిక్‌ ప్రాంతం లక్ష్యంగా భారత్‌ చొరవతో ఈ ఐపీఓఐ ఏర్పడిన విష‌యం తెలిసిందే.

ఆ ప్రాంతంలో చైనా ఆర్మీ మౌలిక వసతులు పెంచుకుంటున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత ఏర్ప‌డింది. వ్యూహాత్మక చర్చలు ఫలప్రదంగా సాగాయని జైశంకర్ ట్విట్ట‌ర్ లో తెలిపారు. తీర ప్రాంత రక్షణతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఐక్య‌రాజ్య‌స‌మితిలో సంస్కరణలు తదితర అంశాల‌పై ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రిపారు. బ‌ల‌మైన‌ సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థను రూపొందించుకునే దిశగా రెండు దేశాల మధ్య సైబర్‌ సెక్యూరిటీ ఒప్పందం కుదిరింది. అలాగే, 5జీ సాంకేతికత, కృత్రిమ మేధ వంటి విష‌యాల్లో పరస్పర సహకారానికి సంబంధించి ఇరు దేశాల‌ మధ్య ఒప్పందం కుదిరింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/