ప్రపంచదేశాలకు భారత్‌ ఆదర్శంగా నిలుస్తోంది

ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌

antonio guterres
antonio guterres

న్యూయార్క్‌: ప్రపంచ దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను అందిస్తూ అండగా నిలుస్తున్న భారత్‌ను ఐక్యరాజ్యసమితి ప్రశంశించింది. ప్రపంచదేశాలకు భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ అన్నారు. కరోనా వైరస్‌ చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తున్న ఈ మాత్రలను ఇప్పటికే భారత్‌ అనేక దేశాలకు పంపిందని తెలిపారు. అందులో అమెరికా, అఫ్గానిస్తాన్‌, శ్రీలంక, మారిషస్‌తో పాటు కొన్ని ఆఫ్రికా దేశాలకు,ఐరోపా దేశాలకు పంపింది. తాజాగా తమకు హైడ్రోక్లోరోక్విన్‌ మాత్రలు అందిచాలని అడిగిన రష్యాకు కూడా మాత్రలు పంపడానికి భారత్‌ ఇటీవల అంగీకరించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/