భారత్‌లో 24 గంటల్లో 14,516 కొత్త కేసులు

3.95 లక్షలను దాటిన మొత్తం కేసులు

coronavirus-India
coronavirus-India

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా భారీగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,516 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒకరోజు కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే 24 గంటల్లో 375 మంది మరణించడం జరిగింది. తాజా కేసుల చేరికతో మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1,68,269 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 2,13,831 మంది చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇప్పటివరకూ 12,948 మంది మరణించారని వెల్లడించింది. కాగా, కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుతుండటంతో, కరోనా వైరస్ అధికంగా వ్యాపించివున్న పలు ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల అధికారులు చర్యలు చేపడుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/