భారత్‌లోనే చిన్నారుల మరణాల రేటు అధికం

babies
babies

వాషింగ్టన్‌: భారత్‌లోనే చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉందని ఓ సేర్వేలో తెలింది. అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ బ్లూంబర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు భారత్‌లోని 25 రాష్ట్రాల శిశు మరణాల నివేదికలను సేకరించి2000 నుంచి 2015 మధ్య ఐదేళ్లలోపు పిల్లల మరణాలు, అందుకు కారణమైన అంశాలపై పరిశోధన జరిపారు. ఈ కాలంలో చిన్నారుల మరణాల రేటును తగ్గించడంలో భారత్ మెరుగైన ఫలితాలను సాధించిందని, 2000 ఏడాదిలో 2.5 మిలియన్లుగా ఉన్న ఈ రేటు.. 2015 నాటికి 2.5 మిలియన్ల వరకు తగ్గిందని పేర్కొంది. అయినప్పటికీ, ఆ ఏడాది చిన్నారుల మరణాలు అత్యధికంగా ఉంటున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్‌ మొదటి స్థానంలో ఉంది. ఐదేళ్లలోపు ఉన్న చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో అసోం మొదటి స్థానంలో ఉంది. గోవాలో కన్నా ఆ రాష్ట్రంలో ఏడు రెట్లు ఈ రేటు అధికంగా ఉంది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/