ఉగాండాలకు భారత్‌ బహుమతి

ఉగాండాలకు భారత్‌ బహుమతి
India gifts 36 vehicles, including 10 troop carriers, to Uganda

కంపాలా: భారత్‌ ఉగాండాలకు 36 వాహనాలను బహుమతిగా ఇచ్చింది. 2018 జూలైలో ప్రధాని నరేంద్ర మోడి ఉగాండాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ పౌరులు, సైనికుల అవసరాల కోసం వాహనాలను బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని భారత్‌ ఇప్పుడు నెరవేర్చింది. ఉగాండాకు 36 వాహనాలను ఉచితంగా అందజేసింది. వీటిని అందుకున్న ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అడాల్ఫ్ మ్వేసిగేకి భారత్ ఔదార్యాన్ని కొనియాడారు. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. 36 వాహనాలల్లో పది బస్సులు, పది సైనికుల తరలింపు వాహనాలు, రెండు అంబులెన్స్‌లు, 14 మోటార్ బైక్‌లు ఉన్నాయి. ఈ నెల 24న కంపాలాలో జరిగిన కార్యక్రమంలో ఉగాండాలోని భారత రాయబారి ఏ అజయ్ కుమార్, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి అడాల్ఫ్ మ్వేసిగేకి వీటిపి అందజేశారు. దీంతో భారత్ సహాయానికి ఉగాండా కృతజ్ఞతలు తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/