రెండో రోజు ఆటముగిసే సరికి ఇండియా స్కోరు 9/1
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ రెండో రోజు ముగిసే సరికి ఇండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసిన సంగతి విదితమే. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దీంతో భారత్ కు 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా రాణించి 53 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. ఒక రనౌట్ అయ్యింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/