జిఎస్‌పి రద్దుపై భారత్‌ ఫోకస్‌

వ్యవసాయం, ఇమిటేషన్‌ జ్యూయెలరీ, ఫార్మా ఎగుమతులకు ఊతం

exports
exports

న్యూఢిల్లీ: అమెరికా సుంకాల విధింపు, జిఎస్‌పిని రద్దుచేసిన కేటగిరీలకు దేశీయంగా సుంకాలను రాయితీలివ్వడంతోపాటు, అమెరికాయేతర దేశాలకు ఎగుమతులు చేయాలన్న వ్యూహంతో భారత్‌ముందుకుపోతోంది. సుంకాలరహిత ఎగుమతులను ఇటీవలే అమెరికా రద్దుచేయడంతో సుమారు రెండువేల ఉత్పత్తులపై ఇపుడు భారీ సుంకాలు పడుతున్నాయి. ప్రత్యేక ప్రాధాన్యతా హోదా స్కీంను రద్దుచేయడంవల్ల ఇపుడు మూడువేల ఉత్పత్తులపై ప్రభావంపడుతోంది. కొన్ని ప్రత్యేరంగాలు ఈ విధానం వల్ల దెబ్బతింటునానయని, అందువల్ల వాటిని ముందు పునరుద్ధరించేచర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు.

ఇమిటేషన్‌జ్యూయలెరీ, తోలు ఉత్పత్తుల పాదరక్షలుమినహాయించి మిగిలిన ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, శస్త్రిచికిత్సల పరికరాలు, రసాయనాలు, ప్లాస్టిక్స్‌, వ్యవసాయ ఉత్పత్తుల వంటి రంగాలు ఇపుడు జిఎస్‌పి రద్దుతో ఎక్కువ దెబ్బతింటునానయని భారత ఎగుమతిసంఘాల సమాఖ్య పేర్కొంటున్నది. కేంద్ర, రాష్ట్రాల పన్నులు, సుంకాల రాయితీ విధానానిన ఈ ఉత్పత్తులకు అమలుచేయాలని ఎఫ్‌ఐఇఒ చెపుతోంది. వాణిజ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన తర్వాత మంత్రి పియూష్‌ గోయల్‌ అధికారులతో నిరంతరం సమావేశాలునిర్వహించి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇపుడు ఈ జిఎస్‌పి రద్దు వ్యవహారంపై కూడా ఈ వారాంతంలోనే సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాం నిర్ణయిస్తారని అంచనా. గతనెల 31వ తేదీనే జిఎస్‌పి స్కీంను భారత్‌ ఉత్పత్తులపై మినహాయిస్తున్నామని, జూన్‌ 5వ తేదీనుంచి అమలుకు వస్తుందని వెల్లడించారు. భారత్‌అమెరికా ఉత్పత్తులకు మార్కెట్‌చేరువచేయడంలేదన్న కక్షతోనే ప్రతీకారచర్యగా అమెరికా ఈ సుంకం రద్దుచేసిందని అంచనా.

జిఎస్‌పి ఉపసంహరణ వల్ల సుమారు 6.35 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు భారత్‌నుంచి వచ్చేవి దెబ్బతింటాయి. ఎగుమతిదారులు సాలీనా సుమారు 260 మిలియన్‌ డాలర్లమేర నష్టపోతారని అంచనా. వ్యవసాయం, ఆటో విడిభాగాలు, ఫార్మారంగాలు వీటివల్ల తీవ్రంగా దెబ్బతింటాయని, భారత్‌ముందుగానే మేల్కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెస్‌ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. సుమారు 28 బిలియన్‌ డాలర్ల అమెరికాకు ఎగుమతులపై వీటిప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. వాణిజ్య లావాదేవీల్లో భారత్‌ శ్రేయస్సును విస్మరించి ముందుకు వెళ్లలేమని భారత్‌ వాణిజ్యశాఖ స్పష్టంచేసింది.

వాస్తవానికి ట్రంప్‌ హయాంలో వాణిజ్యం వాణిజ్యమిగులుతోనే ఉన్నట్లు అంచనా. అయితే వైద్యపరికరాలపై ధరల పరిమితులు ఎత్తివేయాలని, ఖచ్చితంగా కొన్ని ధృవీకరణలు, అనుమతులు డైయిరీ ఉత్పత్తుల ఎగుమతులకు ఉండాలని, సెల్యులర్‌ఫోన్లపై దిగుమతి సుంకాలు రద్దుచేయాలని, ఇకామర్స్‌ విధానంలో పొందుపరిచిన కొన్ని మార్పులు వెంటనే అమలుచేయాలని అమెరికా పట్టుబడుతోంది,. స్థానిక విక్రేతలనుంచే 30శాం కొనుగోళ్లుచేయాలన్న నిబంధన ఎత్తివేయాలని భారత్‌పై ఎప్పటినుంచో ఒత్తిడిచేస్తోంది. ఈనేపథ్యంలో ఇపుడు అమెరికా జిఎస్‌పి రద్దుకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాల్సిన అవసరం వచ్చింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/