ఇండియా ఫెలో లీడర్‌షిప్‌

ఉన్నత విద్యకు ఆదరణ రోజురోజుకు పెరుగుతున్నది. ఆధునిక కాలానికి తగినవిధంగా కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి. అందుబాటులో మరెన్నో కోర్సులున్నాయి. ఎందుకంటే విద్యారంగంలో గణనీయమైన మార్పులొస్తున్నాయి. ఈ రంగంలో మార్పులు తీసుకురావడానికి అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సేవలందిస్తోంది. బోధనపై మక్కువ ఉన్నవారికి ఏడాది వ్యవధితో ఫెలోషిప్పులు అందిస్తోంది. ఇందుకోసం దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి ప్రతినెలా రూ.35,000 స్లైపెండ్‌ చెల్లిస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫెలోషిప్‌ పూర్తయిన తర్వాత ప్రేమ్‌ జీ ఫౌండేషన్‌లో కొనసాగడానికి అవకాశం లభిస్తుంది.
దరఖాస్తులు: జూన్‌, 2020 దాకా స్వీకరిస్తారు.
భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దడానికి ఇండియా ఫెలో లీడర్‌షిప్‌ ప్రోగ్రాం ఆవిర్భవించింది. వీరు మూలాల నుంచి పనిచేసి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. కొత్త ఆలోచనలతో సంస్థలకు తోడ్పాటు అందిస్తారు. ఇందుకోసం వీరికి శిక్షణ అందించి, మెంటర్లను ఏర్పాటు చేస్తారు. పనిచేస్తూ తెలుసుకునేలా చూస్తారు. ఈ ఫెలోషిప్‌ వ్యవధి 13 నెలలు. దేశంలో ఎక్కడికైనా వెళ్లడానికీ, ఏప్రాంతం నుంచైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఫెలోషిప్‌ వ్యవధిలో ప్రతి నెల రూ.16,000 స్టైపెండ్‌ అందుతుంది.
ఎంపిక విధానం: నాలుగంచెల్లో ఉంటుంది. ముందుగా అభ్యర్థులు తమ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అవకాశం దక్కించుకున్నవారు తమకు ఇష్టమున్న అంశంలో వెయ్యి పదాలతో వ్యాసాన్ని రాసి పంపాలి. ఇలా వచ్చిన వ్యాసాల్లో ప్రభావవంతంగా ఉన్నవాటిని ఎంపిక చేసి అసెస్‌మెంట్‌ (ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసు 21-27 ఏళ్లలోపు ఉండాలి.
గాంధీ ఫెలోషిప్‌: ఇందులో చేరినవారు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. స్కూల్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రాం పేరుతో ఫెలోషిప్‌లు అందిస్తున్నారు. పాఠశాలలకు మౌలిక సదుపాయాలు, విద్యలో మార్పుల కోసం స్థానిక సిబ్బందితో కలిసి వీరు పనిచేస్తారు. ఇది రెండేళ్ల రెసిడెన్షియల్‌ కోర్సు. ఫెలోషిప్‌ నెలకు రూ.14,000 చెల్లిస్తారు. ఉచితంగా వసతి కల్పిస్తారు. ఫెలోషిప్‌ మొత్తంలో నెలకు రూ.7000 ఖర్చులకు ఇస్తారు. మిగిలినది కోర్సు పూర్తయిన తర్వాత చెల్లిసారు. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసు 26 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు గడుపు: మార్చి 31,2020
website: https://gandhifellowship.org/

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/