వరల్డ్‌కప్‌లో ఆల్‌టైం ఫేవరెట్‌ టీమిండియానే

mohammad azaruddin
mohammad azaruddin

ఐసిసి వన్డే ప్రపంచకప్‌-2019లో టీమిండియానే ఫేవరెట్‌, ఇది చాలా మంది మాజీ క్రికెటర్లు అంటున్న మాట, ఇప్పుడు ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ కూడా చేరారు. ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లిసేనకు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ..టీమిండియాకు ఇది సదవకాశం, మనకు ప్రపంచంలోనే అద్భుతమైన బౌలర్లున్నారు. ఇంగ్లాండ్‌ పిచ్‌లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు ఇబ్బంది కలుగుతుందని చాలా మంది అంటున్నారు. మన బౌలర్లకు కూడా ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగల సత్తా ఉంది. పేస్‌, స్పిన్‌ విభాగంలో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారని అజారుద్దీన్‌ పేర్కొన్నారు.
ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెటే, తొలి ప్రాధాన్యం టీమిండియాకు ఇస్తా ఆ తర్వాత రెండు, మూడు స్థానాలకు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాకు ఇస్తా అని ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరం చెప్పలేం అని అజారుద్దీన్‌ పేర్కొన్నారు. ప్రతి జట్టుకు గెలుపోటములు ఎదురవుతూ ఉంటాయి. కాని మన జట్టుకు అలాంటివి రాకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ముందుగానే టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెపుతున్నా, ప్రతి ఆటగాడు బాగా రాణించాలని ఆశిస్తున్నానంటూ అజారుద్దీన్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/