ప్రత్యర్థిపై కోహ్లీసేన 241 పరుగుల ఆధిక్యం

Team India
Team India

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చరిత్రాత్మక డేనైట్‌ టెస్టులో కోహ్లీ సేన అదరగొట్టింది. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 136 పరుగులు 194 బంతుల్లో చేసి అద్వితీయ శతకంతో అదరగొట్టడమేకాక ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేశారు. తొలి ఇన్నింగ్స్‌ భారీ స్కోరు 347-9 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో బంగ్లాపై 241 పరుగులు ఆధిక్యతను భారత్‌ సాధించింది. టీమిండియా పేసర్ల ఊపు చూస్తే బంగ్లా ఆటగాళ్ళను త్వరగానే ఇంటిదారి పట్టించేలా కనిపిస్తుంది. ఆట ముగిసే సమయానికి మహ్మద్‌ షమి 10 పరుగులు, వృద్ధిమాన్‌ సాహా 17 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. అంతేకాకుండా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె కూడా చక్కని ప్రదర్శనతో, చాకచక్యంగా 69 బంతుల్లో 51 పరుగులు చేసి అర్ధశతకంతో అందరిని ఆకట్టుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana