రాహుల్‌ ద్రవిడ్‌ మాటలతో నా మనసు కుదుటపడింది

rahul dravid & ajinkya rahane
rahul dravid & ajinkya rahane

న్యూఢిల్లీ: భారత లిమిటెడ్‌ ఓవర్‌ ఫార్మాట్‌కు దూరమైన బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానే ఇప్పుడు కేవలంటెస్టు స్పెషలిస్టుగానే సేవలందిస్తున్నాడు. ఈ క్రమంలో జూన్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌కు కూడా తాను దూరమయ్యాడు. ఆ సమయంలో తాను ఎంతో డిప్రెషన్‌లో ఉన్నానని అన్నాడు. భారత మాజీ కెప్టెన్‌ ప్రస్తుత నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడక తన మనసు కుదుటపడిందని అజింక్య వెల్లడించాడు. కొన్నిసార్లు మనం సక్సెస్‌ కోసం విపరీతంగా వెంటపడుతుంటాం. అయితే కొన్ని సార్లు ఈ వెతుకులాటను ఆపాల్సిన పరిస్థితి ఎదురవుతందన్నాడు. గత వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును ప్రకటించిన సమయంలో నా పరిస్థితి అలాగే ఉండేదన్నాడు. అయితే ఆ సమయంలో రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడడం ఎంతగానో ఉపకరించిందని నా బ్యాటింగ్‌ శైలిని మార్చుకుని తిరిగి గాడిలోపడ్డానని అజింక్య రహానే వివరించాడు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/