భారత్-చైనా సైనికుల మధ్య స్వల్ప ఘర్షణ

పాంగాంగ్ సరస్సు వద్ద ఆర్మీ పెట్రోలింగ్

India-China-troops
India-China-troops

లడఖ్‌: కమ్యూనిస్ట్ దేశం చైనా మరోసారి భారత సైనికులను రెచ్చగొట్టేలా వ్యవహరించింది. దీంతో సరిహద్దులో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరువర్గాల సైనికులు ఒకరిని మరొకరు తోసుకున్నారు. అంతలోనే ఉన్నతాధికారులు స్పందించడంతో ఈ ఘర్షణాత్మక వాతావరణం కాస్తా సద్దుమణిగింది. ఈ ఘటన కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ లో చోటుచేసుకుంది.లడఖ్ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.

త్వరలోనే ఇక్కడ భారత ఆర్మీ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అయితే భారత ఆర్మీ పెట్రోలింగ్ పట్ల చైనా సైనికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. భారత్, చైనా సైనికులు ఈ సందర్భంగా ఒకరినొకరు తోసుకున్నారు. అయితే ఇరుదేశాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి ఆర్మీ ఉన్నతాధికారులు ఈ విషయమై చర్చలు జరపడంతో సమస్య ఒక్కరోజులోనే పరిష్కారమైంది.

లడఖ్టిబెట్ మధ్య ఉన్న పాంగాంగ్ సరస్సు తమదంటే, తమదని భారత్చైనాలు పట్టుబడుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరైన సరిహద్దు లేకపోవడం, ప్రస్తుతం ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను చైనా గుర్తించకపోవడంతో భారత్చైనా సైన్యాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/