మరోసారి భార‌త్‌‌, చైనా సైనికాధికారుల కీలక భేటీ

చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల భేటీ

india-china-army

న్యూఢిల్లీ: భారత్‌, చైనా దేశాల సైనికాధికారులు మరోసారి సమావేశమయ్యారు. చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌ చుశూల్‌ సెక్టార్‌లోని మోల్డో వ‌ద్ద రెండు దేశాల‌కు చెందిన అగ్రశేణి క‌మాండ‌ర్లు ఈ స‌మావేశంలో పాల్గొంటున్నారు. చర్చలు జరపాలని చైనాయే కోరింది. భారత్ తరపున లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్, చైనా తరపున మేజర్ జనరల్ లియు లిన్ చర్చలు జరుపుతున్నారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో తెలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించే ఉద్దేశంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. కాగా ఈ నెల 15వ తేదీన చైనా సైనికులు భారత ఆర్మీపై దాడి చేయడంతో 20 మంది భార‌త జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత సైనికులు తిరగబడడంతో చైనా సైనికులు కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. గాల్వన్‌ లోయ తమదేనంటూ చైనాభారత్ పరస్పరం వాదనలు చేసుకుంటోన్న నేపథ్యంలో జరుగుతోన్న ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/