నేడు భారత్‌-చైనా కమాండర్లు భేటి

లఢక్ వివాదంపై చర్చలు

India-China Army commanders meet today

న్యూఢిల్లీ: భారత్, చైనాకి చెందిన టాప్ కమాండర్లు ఈరోజు సమావేశం కానున్నారు. తూర్పు లఢక్‌ చుషుల్ సెక్టార్‌లోని మాల్డో దగ్గర ఈ చర్చలు జరగనున్నాయి. భారత్ తరపున 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ ఈ చర్చలో పాల్గొంటున్నారు. గత నెల నుంచి నలుగుతున్న లఢక్ వివాదంపై చర్చించబోతున్నారు. ప్రధానంగా చైనా- భారత సరిహద్దుల్లోకి తన సైన్యం చొచ్చుకెళ్లేలా చేస్తోంది. అలాగే లడక్‌లో సైనిక శిబిరాలు, బంకర్లు ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున ఆర్మీనీ, ఆయుధాలనూ దింపుతోంది. దీనిపై భారత్ అభ్యంతరం చెబుతోంది. సైన్యాన్ని వెనక్కి పంపాలనీ, స్థావరాల్ని కూల్చివేయాలని భారత్ కోరుతోంది. ఈ విషయమై నెల రోజులుగా సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య అనధికారిక మాటల యుద్ధం జరుగుతోంది. మే 5న తొలిసారి లడక్ సరిహద్దుల్లోని పాంగోంగ్ సో దగ్గర రెండు సైన్యాల మధ్యా గొడవ జరిగి… 200 మంది గాయపడ్డారు. మే 9న మరోసారి జరిగిన గొడవలో ఓ పది మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు రెండు దేశాల మధ్య కింది స్థాయిలో చర్చలు జరిగాయి. అయిన సమస్య పరిష్కారం కాకపోవడంతో… ఇవాళ మరోసారి చర్చ జరగనుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/