ఇండియా సిమెంట్స్‌ కంపెనీ లాభం రూ. 5.07 కోట్లు

India Cements Limited
India Cements Limited

హైదరాబాద్‌: సిమెంట్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు క్వార్టర్లో రూ. 5.07 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ. 5.03 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. సిమెంట్‌ అమ్మకాలు తగ్గినా, వ్యయాలు తగ్గడం, రియలైజేషనన్లు మెరుగుపరచడం వల్ల నిర్వహణ పనితీరు ఒకింత మెరుగుపడిందని కంపెనీ ఎమ్‌డి ఎన్‌. శ్రీనివాస్‌ చెప్పారు. కార్యకలాపాల ఆదాయం రూ. 1,430 కోట్ల నుంచి 11శాతం వృద్ధితో రూ.. 1,269 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ. 1,439కోట్ల నుంచి రూ. 1,271 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/