కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌… వీసాలు రద్దు

విదేశీయులకు, చైనీయులకు వీసాలు రద్దు

Coronavirus
Coronavirus

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ సందర్భంగా గత రెండు వారాల్లో చైనాలో పర్యటించిన విదేశీయులకు, చైనీయులకు వ్యాలిడ్ వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి హాంగ్ కాంగ్ కి ప్రయాణించే ఎయిర్ ఇండియా విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత ప్రభుత్వం చైనా నుంచి భరత్ కు వచ్చే చైనీయులతో సహా ఇతర ప్రయాణీకులను బోర్డింగ్ కు అనుమతించరాదంటూ అన్ని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ వలన చైనాలో మొదట రోజు 10 నుంచి 20 మంది మరణించగా.. కానీ ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగి కరోనా వైరస్ కాటుకు చైనాలో మృతి చెందిన వారి సంఖ్య 450కు చేరింది. మంగళవారం ఉదయం వరకు ఆ దేశంలో 20,438 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే భారత్ సహా 25 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా వైరస్ కు తగిన మెడిసిన్ ను తయారు చేసే పనిలో అన్ని దేశాలు నిమగ్నమయ్యాయి. వైరస్ బాధితులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తం అవుతున్నాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/