టీమిండియా సిరీస్‌ కైవసం

సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ, కోహ్లీ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌

Team india won the series
Team india won the series

బెంగళూరు: అచ్చొ చ్చిన చిన్నస్వామి స్టేడియంలో భారత క్రికెటర్‌ రోహిత్‌ శర్మ (119, 128 బంతుల్లో ఆరు సిక్స్‌లు, 8 ఫోర్లు) శతకంతో అదరగొ ట్టాడు. కెప్టెన్‌ కోహ్లి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ (89 పరుగులు, 91 బంతుల్లో 8 ఫోర్లు)తో కదం తొక్కాడు. శ్రేయాస్‌ అయ్యార్‌ (44, 35 బంతుల్లో సిక్స్‌, ఆరు ఫోర్లు) మెరిశాడు. దీంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌పై భారత్‌ ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ విధించిన 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 47.3 ఓవర్లలో అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 21తో గెలుచుకుంది. ఆదివారం మూడో వన్డేలో ముందుగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 131 పరుగులు చేశాడు. వన్డేల్లో స్మిత్‌కు ఇది 9వ సెంచరీ కావడం విశేషం. భారత్‌పై మూడోసారి సెంచరీ చేశాడు.భారత బౌలర్లలో షమీ 4 వికెట్లు తీసి సత్తా చాటగా.. జడేజాకు 2, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌కు చెరో ఒక వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌తో మహ్మద్‌ షమీ వన్డేల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/