ప్రపంచ వృద్ధిలో దక్షిణాసియా కీలక పాత్ర?

IMF
IMF


వాషింగ్టన్ : భారతదేశం సారథ్యంలో దక్షిణాసియా ఇప్పుడు ప్రపంచ వృద్ధి కేంద్రంగా ఎదిగేందుకు ముందుకు సాగుతోంది. ఈ విషయం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) తాజా గణాంకాలతో వెల్లడైంది. 2040నాటికి దక్షిణాసియా ప్రపంచ వృద్ధిలో మూడిం ట ఒకవంతుగా కీలక పాత్రను పోషిస్తుంది. ఈ మేరకు ఐఎంఎఫ్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. భౌగోళిక విభజనల పరిధిలో చూస్తే ఐఎంఎఫ్ జాబితాలోకి అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లను చేర్చలేదు. భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులను దక్షిణాసియా దేశాలుగా భౌగోళికంగా వర్గీకరించుకున్నారు. ఖదక్షిణాసియా పురోగమనానికి సిద్ధంగా ఉందా? స్థిర సమగ్రాభివృద్ధి అజెండాను సంతరించుకుంటుందా?గ అనే శీర్షికతో ఐఎంఎఫ్ ఒక విశ్లేషణాత్మక పత్రాన్ని రూపొందించింది.

ఈ ఐఎంఎఫ్ అధ్యయన పత్రాన్ని దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగే ఒక కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఇతోధిక సంస్కరణల ప్రక్రియలు, దీనికి తోడుగా మౌలిక సాధనాసంపత్తిని ఇనుమడింపచేసుకోవడం, ఈ ప్రాంతపు యువశక్తిని, అసంఖ్యాక శ్రామికశక్తిని సరైన విధంగా వినియోగించుకోవడం వంటి పరిణామాలు కీలకంగా మారాయి. ఈ అంశాల ప్రాతిపదికన దక్షిణాసియా ప్రపంచ ప్రగ తిసాధనలో కీలకమవుతుంది. ఇక భారతదేశపు నాయకత్వంలో దక్షిణాసియా 2040నాటికి గణనీయ పాత్ర ను పోషిస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రపంచ వృద్ధిరేటు క్రమాన్ని విశ్లేషించుకుంటే దక్షిణాసియా కీలక భూమిక గురించి విదితమవుతోందని, ఆసియా ఖండం లో పలు చోట్ల ఆశాజనకమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి దక్షిణాసియా అందరిని ఆకర్షిస్తోందని ఐఎంఎఫ్ ఆసియా అండ్ పసిఫిక్ డిపార్ట్‌మెం ట్ డిప్యూటీ డైరెక్టర్ అన్నీ మేరీ గుల్డీ వోల్ఫ్ తమ విశ్లేషణలో తెలిపారు. ఈ ప్రాంతంలో శ్రామిక శక్తి అత్యంత కీలకం కానుంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos/