భారత్ సహా 14 దేశాల పై ఖతార్ నిషేధం

పెరుగుతున్న కరోనా కేసులు..ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న ఖతార్

Qatar bans entry of people from India, 14 other
Qatar bans entry of people from India, 14 other

ఖతార్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)తో పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నాయి. తాజాగా గల్ఫ్ దేశం ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి కరోనా తమ దేశంలోకి వ్యాపించకుండా 14 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించింది. వీటిలో ఇండియా, చైనా, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్, ఇరాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సిరియా, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, దక్షిణకొరియాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ నుంచి విమాన రాకపోకలను ఖతార్ గతంలోనే నిషేధించింది. ఖతార్ లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న మరో 3 కొత్త కేసులు నమోదు కాగా… మొత్తం కేసుల సంఖ్య 15కి పెరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/