భారత గగనతలం వినియోగానికి ఇమ్రాన్ ఖాన్ కు అనుమతి

23న శ్రీలంక వెళ్లనున్న ఇమ్రాన్ ఖాన్
గతంలో మోడి ప్రయాణానికి అంగీకరించని పాక్

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ భారత గగనతలం మీదుగా శ్రీలంక వెళ్లేందుకు భారత్ అనుమతించింది. ఈమేరకు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 23న ఆయన శ్రీలంక పర్యటకు వెళుతుండగా, ఆ విమానం భారత్ మీదుగా వెళ్లనుంది. ఇమ్రాన్ ఖాన్ తన మంత్రివర్గ సహచరులు, అధికారుల బృందంతో కలిసి రెండు రోజుల పర్యటనకు శ్రీలంకకు వెళ్లనున్నారు. ఇందుకు భారత్‌ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆ దేశం చేసిన విజ్ఞప్తికి భారత్‌ సానుకూలంగా స్పందించింది.


కాగా, గతంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడి వీవీఐపీ విమానాలు పాక్‌ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి కోరగా.. తిరస్కరించింది. జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్రంగా జరుగుతున్నాయని, అందుకే తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు మోడి విమానానికి అనుమతి ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. నాటి ఘటనను మనసులో పెట్టుకోని భారత విమానయాన శాఖ, ఇమ్రాన్ ఖాన్ విమానానికి అనుమతినిచ్చింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/