ఆట ముగిసే సమయానికి భారత్ 62/2

భారత్ -ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్

India -Aus test series
India -Aus test series

భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా బ్రిస్బేన్ లో జరుగుతున్న చివరి నాలుగో టెస్ట్ లో రెండో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది, ఓవర్ నైట్ స్కోరు 274/5 తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్ అయ్యింది.తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ శుభమన్ గిల్ వికెట్ ను చేజార్చుకుంది.

తరువాత రోహిత్, పుజారాలు ఇన్నింగ్స్ ను కొనసాగించారు. 44 పరుగులు చేసిన రోహిత్ ఔట్ కావడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. తరువాత రహానే క్రీజ్ లోకి వచ్చాడు.

వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భరాత్ రెండో వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులు వెనుకబడి ఉంది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/