ఫార్మారంగంలో దిక్సూచి భారత్‌

భారతదేశం ఔషధాలకు సంజీవని

Ayurvedic medicine
Ayurvedic medicine

కొత్త సంవత్సరం ప్రారంభమే కరోనాపేరుతో పెను ఉపద్రవం తెచ్చిపెట్టింది.

చైనాలో ప్రారంభమైన ఈ వైరస్‌ మహమ్మారి దాదాపు 200 దేశాలకు విస్తరించి 17 లక్షల మందికి సోకగా ఒక లక్షా నాలుగువేల మంది మరణించారు.

మనదేశంలో నేటికి ఎనిమిది వేల మందికి కరోనా సోకగా 249 మంది మరణించారు.

వచ్చే పది రోజులలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య లక్షలలో మరణించవచ్చునని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు, బ్రెజిల్‌లో కరోనా ప్రభావం అత్యధికంగా ఉంది.

అభివృద్ధి చెందిన దేశాలుగా ఖ్యాతి గడించిన తొలి 10 దేశాలు కరోనా ప్రభావంతో విలవిల్లాడిపోయాయి. ఈ వ్యాధిని నివారణ చేసేందుకు పెద్దఎత్తున హైడ్రాక్సీక్లోరిక్విన్‌ మాత్రల అవసరం ఏర్పడింది.

ఈ ఉపద్రవాన్ని ఊహించని అగ్రరాజ్యాలు ఈ మందులను స్టాక్‌ చేసుకోవడంతోపాటు అవసరానికి తగినట్లుగా తయారు చేసుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు.

అందుకే అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, బ్రెజిల్‌, బ్రిటన్‌ వంటి దేశాలు హైడ్రాక్సీక్లోరీక్విన్‌ మాత్రలు కావాలంటూ భారత్‌పై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించాయి.

బ్రెజిల్‌ ప్రధాని ఈ సందర్భంలో నరేంద్రమోడీకి రాసిన లేఖలో భారతదేశం ఔషధాలకు సంజీవని వంటిదని ప్రశంసించడం ప్రస్తావించకతప్పదు.

అయిదేళ్ల క్రితం కొత్త ఫార్మా విధానం తీసుకువచ్చినప్పుడు ప్రధాని పార్లమెంటులో మందుల తయారీలో భారతదేశం అగ్రగామి కాబోతోందని ఘంటా పధంగా చెప్పారు.

ఇప్పుడు అక్షరాలా అదే నిజమైంది. హైడ్రాక్సీక్లోరిక్విన్‌ మందులను మన ఫార్మసీ సంస్థలు రాత్రింబవళ్లు పనిచేస్తూ ఉత్పత్తి చేస్తున్నాయి.

దేశీయ అవసరాలకుగానూ నెల రోజులకు అవసరమయ్యే మందులు లభ్యమవుతుండగా బాధిత దేశాల వినతులను పరిగణనలోకి తీసుకొని మందుల ఉత్పత్తుల ఎగుమతి నిషేధాన్ని పాక్షి కంగా సడలించి ఇప్పటివరకు 30 దేశాలకు ఎగుమతి చేయ డం ప్రశంసనీయం.

ప్రధాని దార్శనికత, దౌత్యనిపుణతకు ఈ ఘటన ఒక మచ్చుతునక.

ప్రాచీన ఆయుర్వేద విధానానికి అనుగుణంగా కరోనా వ్యాధి నివారణకు ఆయుర్వేద ఔషధ మిశ్రమాలను రూపొందించడంలో కూడా భారత్‌ ఇప్పుడు సఫలీకృతమైంది.

కొందరు రోగులపై ఇప్పటికే ఈ మిశ్రమాలను ప్రయోగించగా సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఆయూష్‌ విభాగం ప్రకటించడం హర్షణీయం.

  • సి.ప్రతాప్‌

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/