వారు వస్తేనే ఆదేశిలిస్తాం

సీనియర్‌ లాయర్లు వస్తేనే.. తీర్పు చెబుతాం

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయ పరిస్థితుల కారణంగా స్వతంత్ర ఎమ్మెల్యెలు ఇటివల సుప్రీంకోర్టు చేరిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు కుమారస్వామి బలపరీక్ష https://www.vaartha.com/news/international-news/పై తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలనిస్వతంత్ర ఎమ్మెల్యేలు నేడు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గి, అభిషేక్‌ మను సింఘ్వీ ఎక్కడ అని ప్రశ్నించింది. వారు వస్తేనే తీర్పు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి స్పష్టం చేశారు.తమ రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించడం లేదంటూ అసమ్మతి ఎమ్మెల్యేలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్‌ రమేశ్ కుమార్‌ తరఫున సింఘ్వీ వాదించారు. అయితే ఇప్పుడు బలపరీక్ష పూర్తయిన దృష్ట్యా ఆ పిటిషన్లను ఉపసంహరించుకుంటామని స్వతంత్ర ఎమ్మెల్యేల తరఫున జూనియర్‌ లాయర్లు సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ముకుల్‌ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వీ ఎక్కడ? అని ప్రశ్నించింది. రోహత్గి ఢిల్లీ లో లేరని జూనియర్‌ న్యాయవాదులు తెలిపారు. దీంతో సుప్రీం ఇప్పుడే తీర్పు ఇవ్వలేం వారు వచ్చాకే ఆదేశాలిస్తామని సుప్రీం స్పష్టం చేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/