ఇండిపెండెంట్‌ అభ్యర్ధిపై దుండగుల కాల్పులు

gun
gun

చండీఘడ్‌: హర్యానాలోని సోనిపట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సతీష్‌ రాజ్‌ దేశ్వాల్‌ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తన కార్యాలయం మొదటి అంతస్తులో నిద్రిస్తూ ఉండగా దుండగులు నిచ్చెనపై నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సిసి ఫుటేజి ద్వారా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్ధి దేశ్వాల్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/