కరోనా పూర్తిగా మెరుగుపడినకే బడులు

YouTube video
Independence Day 2020- Arvind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 74వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం మాట్లాడుతూ..క‌రోనా ప‌రిస్థితులు పూర్తిగా మెరుగుప‌డిన త‌ర్వాతే ఢిల్లీలో బ‌‌డులు తెరుస్తామ‌ని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంలో క‌రోనాకు సంబంధించి మెరుగైన ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు పూర్తిగా న‌మ్మ‌కం ఏర్పడేవ‌ర‌కు పాఠ‌శాల‌ల‌ను తెరిచేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు. రెండు నెల‌ల క్రితంకంటే ప్ర‌స్తుతం ఢిల్లీలో మెరుగైనా ప‌రిస్థితులే ఉన్నాయ‌ని, ఇప్పుడు క‌రోనా అదుపులోనే ఉన్న‌ద‌ని, దీనికి సహ‌క‌రించిన కేంద్ర ప్ర‌భుత్వం, వివిధ శాఖ‌లు, సంస్థ‌లు, క‌రోనా యోధుల‌కు ఆయ‌న‌ కృతజ్ఞ‌త‌‌లు తెలిపారు. ఆప్ ప్ర‌భుత్వానికి విద్యార్థుల భ‌ద్ర‌త‌, ఆరోగ్యం చాలా ముఖ్య‌మ‌ని చెప్పారు. తాను ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నాన‌ని, వారు పాఠ‌శాల‌లు తెర‌వ‌ద్ద‌ని కోరుతున్నార‌ని వెల్ల‌డించారు. తారికి తాను భ‌రోసా ఇవ్వాల‌నుకుంటున్నాని, ప‌రిస్థితులు పూర్తిగా సంతృప్తి క‌లిగిన‌ప్పుడే పాఠ‌శాల‌ల‌ను తెరుస్తామని స్ప‌ష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/