నాలుగో వికెట్‌ కోల్పోయిన దక్షిణఫ్రీకా

India vs South Africa
India vs South Africa

విశాఖపట్నం: భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా కొద్దిసేపటికే నాలుగో వికెట్ కోల్పోయింది. 39/3తో ఈ రోజు ఆట ప్రారంభించిన డీన్ ఎల్గర్, బావుమలు భారత బౌలర్లను ఎదుర్కొంటూ నిలకడగా ఆడారు. ఈ క్రమంలో ఇశాంత్ శర్మ దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టాడు. చక్కటి బంతితో బావుమ(18)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో దక్షిణాఫ్రికా మరో వికెట్ చేజార్చుకొని కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డు ప్లిసెస్ ఆచితూచి ఆడుతున్నాడు. మరో వైపు డీన్ ఎల్గర్ చెత్త బంతులను బౌండరీ తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఎల్గర్ అర్థ శతకం పూర్తి చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. క్రీజులో డీన్ ఎల్గర్(56), డు ప్లిసెస్(35)లు ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 502/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.


తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/