కోపంగా గ్రౌండ్‌ వీడిన ఫించ్‌

india vs australia
india vs australia

బెంగళూరు: బెంగళూరు వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాభారత్ క్రికెట్ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ ఫించ్ ఆగ్రహంగా గ్రౌండ్ వీడాడు. భారీ స్కోరు చేసేలా కనిపించిన ఈ ఆసీస్ కెప్టెన్.. స్టీవ్ స్మిత్ చేసిన పొరబాటుకు బలయ్యాడు. ఇంతకీ ఫించ్ ఎలా అవుటయ్యాడంటే.. షమి బౌలింగ్‌లో బంతిని ఆఫ్‌సైడ్‌కు కొట్టిన స్మిత్, రన్ కోసం ముందుకొచ్చాడు. అది చూసిన ఫించ్ వేగంగా స్ట్రయికర్ ఎండ్‌కు పరిగెత్తాడు. అయితే సందేహంగా పరుగును ప్రారంభించిన స్మిత్.. బంతిని జడేజా అందుకోగానే వెంటనే వెనుదిరిగాడు. అప్పటికే మూడొంతుల పరుగు పూర్తి చేసిన ఫించ్ కూడా ముందుకే వచ్చాడు. అప్పుడు జడేజా విసిరిన బంతి వికెట్లను తగల్లేదు. అప్పటికి ఫించ్, స్మిత్ ఇద్దరూ ఒకేవైపు క్రీజుకు చేరుకున్నారు. ఆ సమయంలో తనవైపు వచ్చిన బంతిని అందుకున్న శ్రేయాస్ అయ్యర్.. దాన్ని బౌలింగ్ ఎండ్‌లోనే ఉన్న షమికి విసిరాడు. దాన్ని అందుకున్న షమి వెంటనే వికెట్లను గిరాటేశాడు. దీంతో ఫించ్ అవుటయ్యాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/