పెరుగుతున్న శిక్షణా రంగాలు

పెరుగుతున్న శిక్షణా రంగాలు
Training Centre

నేరుగా ఉద్యోగంలో చేరి అనుభవం పొందడం వేరు, దానికి తగిన శిక్షణ పొంది ఉద్యోగం చేయడం వేరు. ఈ రెండింట్లో రెండోదానికే అధిక ప్రాధాన్యతని స్తున్నాయి కంపెనీలు.
సరికొత్త సాంకేతికతలు ఉద్యోగాల స్వభావాల్లో మార్పులు తెస్తున్నాయి. ఆ నైపుణ్యాలను విద్యాభ్యాస దశలోనే నేర్చుకునే ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. విస్తరిస్తున్న విద్యారంగంలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగం అనివార్యమైపోయింది.

ఈ పరిణామాల మూలంగా విద్యా, శిక్షణ రంగాల్లో నియామకాలు పుంజుకుంటున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క మనదేశంలో విద్యా, శిక్షణ రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని ఆన్‌లైన్‌ జాబ్‌ పోర్టల్‌ షైన్‌.కామ్‌ సర్వే చెబుతోంది.
ఈ రెండు రంగాల్లో పెద్ద సంఖ్యలో సాంకేతిక అంకుర సంస్థలు (టెక్‌ స్టార్టప్స్‌) ఆరంభమయ్యాయి. ఒక అంచనా ప్రకారం మనదేశంలో స్టార్టప్‌లు ఎడ్యుకేషన్‌లు కంటెంట్‌పై 32 శాతం, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌, సేవలపై 25శాతం స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌పై 22శాతం దృష్టిపెడుతున్నాయి. బైజూస్‌లాంటివి అంకుర సంస్థలుగా మొదలైనవే.

దీంతోపాటు మొబైల్‌ లర్నింగ్‌, ఈ-లర్నింగ్‌ల లాంటి నూతన విధానాల వినియోగం పెరగటం ఈ రంగాల్లో ఉద్యోగాల సృష్టికి దోహదపడుతున్నాయి. అంకుర సంస్థలో డెవలపర్లుగా, సేల్స్‌ మార్కెటర్లుగా నూతన అవకాశాలు ఏర్పడ్డాయి.

మనదేశంలో డిజిటల్‌ లర్నింగ్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ-లర్నింగ్‌ మార్కెట్‌లో ప్రథమ స్థానం అమెరికాదైతే, తర్వాతి స్థానం భారత్‌దే! దేశజనాభాలో సగానికి పైగా యువతే. అంతేకాదు 5-24 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు కోట్లమంది. పాఠశాలలూ, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా సుశిక్షితులైన బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలూ లేవు.
అందుకే విద్యా, శిక్షణ రంగాల అభివృద్ధికి ఇక్కడున్న అవకాశాలూ అపారమని చెప్పొచ్చు.

ముఖ్యంగా నూతన సాంకేతికత వినియోగం, సాంప్రదాయిక బోధనా పద్ధతుల స్థానంలో మెరుగైన విధానాలను పాటించే క్రమంలో అత్యధిక ఉద్యోగా వకాశాలు పెరుగుతున్నాయి.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/