భారత్‌లో పెరుగుతున్న వ్యక్తిగత పొదుపు!

saving
saving

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు చేసి మూడేళ్లు గడిచింది. నవంబరు 8, 2016 రాత్రి 8గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోడీ రూ.500, రూ.1000నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం వెలికితీతతో పాటు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు అనూహ్య ప్రకటన చేశారు. నోట్లు మార్చుకోవడానికి ప్రజలు ఇబ్బందిపడకుండా సమయం ఇచ్చారు. దీంతో ఎటిఎంలు, బ్యాంకుల వద్ద ప్రజలు క్యూకట్టారు. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ భావిభారతం కోసం తీసుకున్న నిర్ణయంగా భావించి చాలా మంది ఈ ఇబ్బందులు భరించారు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. పేటిఎం, అమెజాన్‌ పే వంటివి అవకాశాలను అందిపుచ్చుకున్నాయి. ప్రభుత్వం బీమ్‌ యాప్‌ను తీసుకువచ్చింది. డిజిటల్‌ ట్రాన్సక్షన్స్‌ పెరిగినప్పటికీ, నగదు రూపంలో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం 2011-12 తర్వాత కరెన్సీ రూపంలో దాచుకునే నగదు పరిమాణం అత్యధిక స్థాయిలో ఉంది. ప్రజలు పొదుపు చేసే మొత్తంలో నగదు వాటా 2011-12లో 11.4శాతం కాగా, 2017-18 నాటికి ఏకంగా 25.2శాతానికి పెరిగింది. డిపాజిట్ల రూపంలో దాచుకునే మొత్తం 57.9శాతం నుంచి 28శాతానికి పడిపోయింది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/specials/women/