20వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోలుపై లీటర్‌కు 21 పైసలు..డీజిల్‌పై 17 పైసలు పెంపు

petrol & diesel
petrol & diesel

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకీ పెరుగుతున్నాయి. నేడు వరుసగా 20వ రోజు కూడా ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగాయి. పెరిగిన ధరల అనంతరం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకి రూ.80.13గా ఉండగా, డీజిల్ ధర రూ.80.19గా ఉంది. కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ.81.82, డీజిల్ ధర రూ. 75.34, ముంబైలో పెట్రోలు ధర రూ.86.91, డీజిల్ ధర రూ.78.51, చెన్నైలో పెట్రోల్ ధర రూ.83.37, డీజిల్ ధర రూ.77.44గా ఉంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.82.96కి చేరింది. కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ప్రజలపై పెట్రోల్ ధరల భారం కూడా అధికమవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/