శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,22,836 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 35,315 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 847.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 75.4720 టీఎంసీలుగా కొనసాగుతోంది. మరోవైపు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/