పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి
పెరిగిన దేశీయ ఇంధన ధరలు

ముంబై: దేశీయ ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధర శనివారం హైదరాబాద్లో లీటరు రూ.17పైసలు పెరిగి రూ.84.64కు చేరింది.
డీజిల్ ధర కూడా రూ.23పైసలు పెరుగుదలతో రూ.77.35కి పెరిగింది. అమరావతిలో లీటరు పెట్రోల్ రూ.17పైసలు పెరిగి రూ.87.57కి చేరింది.
డీజిల్ ధర రూ.22పైసలు పెరిగి రూ.79.85కి చేరింది. ఇక విజయవాడలోనూ పెట్రోల్ ధర రూ.17పైసలు పెరిగి రూ.87.10కి చేరగా, డీజిల్ ధర రూ.22 పైసలు పెరిగి రూ.79.41కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర పెరిగింది. రూ.15పైసలు పెరిగి రూ.81.38కి చేరింది. అదేవిధంగా డీజిల్ ధర కూడా రూ.20పైసలు పెరిగి రూ.70.88కి చేరింది.
వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.17పైసలు పెరిగి రూ.88.09కి చేరింది. డీజిల్ ధర రూ.23పైసలు పెరిగి రూ.77.34కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 2.06శాతం పెరిగి 45.11డాలర్లకు చేరింది.
ఇక డబ్ల్యూటిఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 1.29శాతం పెరిగి 42.44డాలర్లకు చేరింది.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/