తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

Increased cold intensity
Increased cold intensity

విశాఖ: రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. దీని ప్రభావంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. రాత్రుల్లు విపరీతమైన చలి ఉంటుంది. పగలు కూడా మధ్యాహ్నం వరకు చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాలతోపాటు ఉత్తర కోస్తా, రాయల సీమల్లో చలి ప్రభావం మరీ అధికంగా ఉంది. ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్లే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆకాశం కూడా నిర్మలంగా ఉండడంతో చలి ప్రభావం మరింత కనిపిస్తోంది. చాలా చోట్ల గతంతో పోల్చుకుంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలోని గిన్నెదరిలో 5.7 డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవ్యాంధ్రలోని ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీలు, విశాఖ జిల్లా చింతపల్లి ఏజెన్సీలో 8 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల మంచు దుప్పటి ప్రభావం కూడా ఉంది. సంక్రాంతి దాటే వరకు చలి ప్రభావం అధికంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/