క్వారంటైన్ కేంద్రాలను పెంచండి ; జగన్

కరోనా నివారణ చర్యలపై సమీక్షా సమావేశం

jagan mohan reddy
jagan mohan reddy

అమరావతి; ఏపీలో లాక్ డౌన్ సడలింపులు జరిపితే ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా వస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అందుకు అనుగుణంగా క్వారంటైన్ కేంద్రాలను పెంచాలని అధికారులను జగన్ ఆదేశించారు. నేడు కరోనా నివారణ చర్యల పై జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చేవారికి నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారిని హొమ్ క్వారంటైన్ లో ఉంచాలన్నారు. ఇక గుజరాత్ నుంచి వచ్చే మత్స్య కారులను శాంపిల్ టెస్ట్స్ నిర్వహించిన తరువాత వచ్చే ఫలితాల ఆధారంగానే వారిని ఇళ్లకు పంపాలన్నారు. టెలి మెడిసిన్, పీహెచ్ సి , విలేజ్ క్లినిక్ ల మధ్య సమన్వయము ఉండాలని సూచించారు. అధికారులు క్వారంటైన్ కేంద్రాలలో పరిశుభ్రత , భోజన సదుపాయాలపై సమీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా మరిన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/telangana/