పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

petrol
petrol

ముంబై: దేశీయ గత కొన్ని రోజులుగా పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే నేడు మంగళవారం మాత్రం ఇంధనం ధరలు పెరిగాయి. మంగళవారం పెట్రోల్‌పై 5పైసలు, డీజిల్‌ ధర 5 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.76.28కి చేరింది. డీజిల్‌ ధర కూడా రూ.71.01కి చేరింది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.03కు చేరింది. డీజిల్‌ ధర రూ.70.42గా నమోదైంది. ఇక విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.75.66కు చేరగా, డీజిల్‌ ధర రూ.70.08కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.71.76కు చేరింది.

డీజిల్‌ ధర రూ.65.14గా నమోదైంది. అదేవిధంగా వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.77.45కు చేరగా, డీజిల్‌ ధర రూ.68.32గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారల్‌కు 0.61శాతం పెరిగి 62.97డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.74శాతం పెరిగి 58.28డాలర్లకు చేరింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/news/business/