జయదేవ్‌ ఆఫీసుల్లో ఐటి దాడులు

galla jaydev
galla jaydev


హైదరాబాద్‌: ఏపి ఎంపి గల్లా జయదేవ్‌ ఆఫీసుల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. గుంటూరు నియోజకవర్గం నుంచి ఈ సారి జయదేవ్‌ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు 680 కోట్లుగా ఉన్నట్లు పేర్కోన్నారు. ఐటిశాఖ సోదాలు చేపట్టడంతో గుంటూరులోని పట్టాభిపురంలో టిడిపి నేతలతో కలిసి జయదేవ్‌ రాత్రి ధర్నాకు దిగారు. టిడిపిని ఎందుకు టార్గెట్‌ చేశారు. ఎన్నికలపై మోది ప్రభావం ఉండాలనే ఇలా చేస్తున్నారని, దేశం ఎమర్జెన్సీ వైపుగా వెళ్తోందని జయదేవ్‌ ఆరోపించారు. జయదేవ్‌ కంపెనీలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గుర్రప్పనాయుడు ఇంట్లో మంగళవారం సాయంత్రం ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ 30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/